హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, శాసనమండలి కార్యదర్శి వీ నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి, డీజీపీ శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీ విజయకుమార్, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా హాజరయ్యారు.