హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ, శాసనమండలి కార్యకలాపాల నిర్వహణ నియమావళి ప్రకారం 2026-27 సంవత్సరానికి వివిధ సంక్షేమ, ఇతర ఉమ్మడి కమిటీలు, శాసనమండలి కమిటీలు, శాసనసభ కమిటీలలో చైర్పర్సన్, సభ్యులుగా వ్యవహరించడానికి అసెంబ్లీ, మండలి నుంచి సభ్యులను నామినేట్ చేశారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, మండలి సెక్రటరీ డాక్టర్ వీ నర్సింహాచార్యులు బులిటెన్ విడుదల చేశారు.
1. సబార్డినేట్ లెజిస్లేషన్: కడియం శ్రీహరి
2. మౌలిక వసతుల కమిటీ: అసెంబ్లీ స్పీకర్
3. షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమ కమిటీ: మేడిపల్లి సత్యం
4. గిరిజన సంక్షేమం: పాయం వెంకటేశ్వర్లు
5. వెనుకబడిన తరగతుల సంక్షేమం: మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
6. లైబ్రరీ కమిటీ: డాక్టర్ మట్ట రాగమయి
7. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం: చిట్టెం ప్రియాంకరెడ్డి
8. మైనార్టీ సంక్షేమం: తోట లక్ష్మికాంతరావు
9. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ: స్పీకర్ 9 కమిటీల్లోనూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు.
1 పిటిషన్స్ కమిటీ: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్(చైర్మన్), ఆరుగురు ఎమ్మెల్యేలు
2. ప్రివిలేజ్ కమిటీ: డిప్యూటీ స్పీకర్(చైర్మన్), ఆరుగురు ఎమ్మెల్యేలు
3. ప్రభుత్వ హామీల కమిటీ: పటోళ్ల సంజీవరెడ్డి (చైర్మన్), ఆరుగురు ఎమ్మెల్యేలు.
4. రూల్స్ కమిటీ: అసెంబ్లీ స్పీకర్(చైర్మన్), పది మంది ఎమ్మెల్యేలు
5. ఎథిక్స్ కమిటీ: రావూరి ప్రకాశ్‌రెడ్డి(చైర్మ న్), సభ్యులుగా ఆరుగురు ఎమ్మెల్యేలు
1. పిటిషన్స్ కమిటీ: డిప్యూటీ చైర్మన్(చైర్మన్), నలుగురు ఎమ్మెల్సీలు
2. ప్రివిలేజ్ కమిటీ: డిప్యూటీ చైర్మన్(చైర్మన్), నలుగురు సభ్యులు
3. ప్రభుత్వ హామీల కమిటీ: కెతావత్ శంకర్‌నాయక్ (చైర్మన్),నలుగురు సభ్యులు
4. రూల్స్ కమిటీ: మండలి చైర్మన్(చైర్మన్), 10 మంది సభ్యులు
5. సభలో ఉంచిన పత్రాల కమిటీ: చల్లా వెంకట్రామిరెడ్డి(చైర్మన్), నలుగురు సభ్యులు
6. ఎథిక్స్ కమిటీ: మహేశ్‌కుమార్ గౌడ్(చైర్మన్), నలుగురు సభ్యులు
తెలంగాణ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ, విధాన నియమావళికి అనుగుణంగా మార్చి 30న సభ ఆమోదించిన తీర్మానం మేరకు ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగా లు, విద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లు-2026 (ఎల్ఏ బిల్లు నెంబర్ 20/2026)పై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నామినేట్ చేశారు. ఈ కమిటీ 2026 వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు నివేదికను సమర్పించనున్నది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి బులిటెన్ విడుదల చేశారు. కమిటీ చైర్మన్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్, సభ్యులుగా ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మికాంతారావు తోట, జీ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, యశస్విని మామిడాల, దానం నాగేందర్, కోవ లక్ష్మి, కే మాణిక్‌రావు, రామారావు పవార్, అహ్మద్బిన్ అబ్దుల్ బలాల, కూనంనేని సాంబశివరావు ఉన్నారు.