బయ్యారం, అక్టోబర్ 26 : మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసిన కానిస్టేబుల్‌పై పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు భర్తతో మనస్పర్ధల కారణంగా గతంలో గొడవలు జరిగాయి.
విషయం తెలుసుకున్న బయ్యారం పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుల్ భూక్యా దినేష్ సదరు మహిళతో మాట్లాడాడు. తాను బాగా చూసుకుంటానని, పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆదివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దినేశ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.