హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సగర భగీరథ ఆత్మగౌరవ భవన్ వెల్ఫేర్ ట్రస్ట్ నూతన చైర్మన్గా అస్కాని మారుతి సాగర్ నియమితులయ్యారు. వైస్ చైర్మన్లుగా పాలకొండ ప్రణీ లు చందర్, మోడల తిరుపతయ్య, మోడల రవి, పెద్దబుద్దుల సతీశ్, మోడల పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా గౌరక్క సత్యం, సంయుక్త కార్యదర్శులుగా మందా డి ఉదయ్, అస్కాని వెంకటస్వామి, రేకబు మురళీకృష్ణ, మోడల ఆంజనేయులు, కోశాధికారిగా దుంపల సమ్మయ్య, సంయుక్త కోశాధికారిగా ఏరుకొండ ప్రసాద్, ట్రస్టీలుగా మాదంశెట్టి కృష్ణ, ఉప్పరి రవి స్రవంతిలు ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన రెండెకరాలలో సగర ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర
కార్యవర్గం తీర్మానించింది.