సిద్దిపేట, ఏప్రిల్10 : సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో రైతు ముచ్చర్ల కొమురయ్య ఆత్మహత్యపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మిత్తి కట్టలేక మృత్యుఒడికి’ అనే కథనానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ స్పందించారు. బుధవారం కాన్గల్ గ్రామానికి వెళ్లి వ్యవసాయ అధికారులు రైతు వివరాలు సేకరించారు.
ముచ్చర్ల కొమురయ్య అనే రైతు పేరుమీద భూమి లేదని, అందుకే రైతుబీమా, రైతుబంధు వర్తింప చేయబడలేదని అధికారులు తెలిపారు. బాధిత రైతు తండ్రి ముచ్చర్ల బాలయ్య పేరు మీద ఎకరా 36 గుంటల భూమి ఉన్నదని.. ఆ భూమికి ప్రతి విడుత రైతుబంధు వస్తున్నదని జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు.