హైదరాబాద్ : ఆసియాన్ – ఇండియా మీడియా ఎక్స్ఛేంజీలో భాగంగా పది ఆసియా దేశాలకు చెందిన 20 మంది జర్నలిస్టుల బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా బృందం ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఆదివారం సందర్శంచింది. జర్నలిస్టులకు టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వీ రాజన్న వారికి ఘనస్వాగతం పలికారు.
టాటా కంపెనీ విశిష్టత, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో టీసీఎస్ అందిస్తున్న ఐటీ సేవలు, వార్షిక టర్నోవర్, ఉద్యోగులు సంఖ్య, హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయాలు, మహిళా ఉద్యోగుల సంఖ్య, ఆసియాన్ దేశాల్లో చేస్తున్న కార్యకలాపాలపై వారికి వివరించారు. అనంతరం భారత్ బయోటెక్‌ను ఆసియాన్ దేశాల జర్నలిస్టుల బృందం సందర్శించింది. ఫార్మా రంగంలో భారత్ బయోటెక్ చేస్తున్న కృషిని, కొవిడ్ వాక్సిన్ గురించి కంపెనీ అధికారులు వివరించారు.