నకిలీ పాస్‌పోర్టు కేసులో ఏఎస్సై లక్ష్మణ్ అరెస్టు
నిజామాబాద్ జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న ఎర్ర లక్ష్మణ్‌ను నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశా రు.
- రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు
- ఆరుగురు నిందితుల కస్టడీ పొడిగింపు
నాంపల్లి కోర్టులు, జనవరి 31 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న ఎర్ర లక్ష్మణ్‌ను నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశా రు. పాస్‌పోర్టు చట్టంతోపాటు ఐపీసీలోని 420, 465, 468, 471, 120-బీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమో దు చేసి 15వ నిందితుడిగా చేర్చారు. బుధవారం ఆయనను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
శ్రీలంక దేశస్థుల నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేసి వారికి అక్రమంగా భారత పాస్‌పోర్టులు లభించేలా లక్ష్మణ్ సహకరించాడని సీఐడీ అధికారులు కేసు డైరీలో పేర్కొన్నారు. ఇదే కేసులో అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అలీ జవహరి, మహ్మద్ కమ్రుద్దీన్, పోచంపల్లి దేవరాజ్, చెప్పల సుభాష్, పెద్దూరి శ్రీనివాస్, మురళీధరన్ అనే ఆరుగురు నిందితులను మరో రెండ్రోజులు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని గురువారం జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

