ASI Died : సంగారెడ్డి జిల్లాలో పోలీస్ వాహనం ఢీకొని విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ మరణించారు. మానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మానూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోవింద్ నాయక్ విధి నిర్వహణలో ఉన్న సమయంలో హోంగార్డు రామారావు నడుపుతున్న పోలీసు వాహనం అదుపుతప్పి ఆయనను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది వెంటనే ఆయనను నారాయణఖేడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు.
అయితే ఈ ఘటనపై మృతుని కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పాత కక్షల నేపథ్యంలో హోంగార్డు రామారావును కావాలనే వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే రామారావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోంగార్డు నడుపుతున్న వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతిచెందడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. మానూర్ పోలీస్‌స్టేషన్ ముందే ఈ ఘటన జరిగింది.