అశ్వత్థామరెడ్డి అస్త్రసన్యాసం
అసలు క్యాడరే లేదు.. పార్టీలో ఉన్నోళ్లూ పట్టించుకోలేదు.. ఇక ఎందుకు పార్టీలో ఉండటం అని అస్త్రసన్యాసం చేశాడో బీజేపీ నేత. పార్టీకి గుడ్‌బై చెప్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ రాశాడు.
- బీజేపీకి రాజీనామా చేసిన నేత
- వనపర్తి అభ్యర్థిగా ప్రకటించి బీఫాం ఇవ్వక పోవడంతో మనస్తాపం
- కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ
వనపర్తి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అసలు క్యాడరే లేదు.. పార్టీలో ఉన్నోళ్లూ పట్టించుకోలేదు.. ఇక ఎందుకు పార్టీలో ఉండటం అని అస్త్రసన్యాసం చేశాడో బీజేపీ నేత. పార్టీకి గుడ్‌బై చెప్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ రాశాడు. ఆర్టీసీ యూనియన్‌లో కార్మిక నేతగా పనిచేసిన అశ్వత్థామరెడ్డి కొంత కాలం కిందట బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయనకు పార్టీ అధిష్ఠానం వనపర్తి అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ నుంచి ప్రకటన రాగానే వనపర్తికి చేరుకున్న ఆయన.. స్థానిక బీజేపీ నేతలను కలిసి గెలుపునకు సహకరించాలని కోరారు. వారం పాటు అక్కడే ఉండి ముఖ్య నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకొనేందుకు ప్రయత్నించారు. క్షేత్రస్థాయిలో బీజేపీపట్ల సానుకూలత లేకపోవటంతో పాటు స్థానిక నాయకులెవరూ సహకరించలేదు. బీజేపీ క్యాడర్ మొత్తం ఎడముఖం.. పెడముఖంగా ఉండటం, ఎవరూ పట్టించుకోకపోవటంతో నిరాశకు లోనయ్యారు. కొన్నిరోజుల పాటు వేచిచూసినా ఫలితం లేకపోవటంతో, ఇక తనతో కాదనుకొని చేతులెత్తేశారు. అదే సమయంలో బీజేపీ అధిష్ఠానం ఆయనకు బీఫాం కూడా ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన అశ్వత్థామ రెడ్డి.. బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. బీజేపీ పార్టీని నమ్ముకొని వచ్చినందుకు జరిగిన పరిణామాలతో పార్టీకి రాజీనామా చేశారని వనపర్తి పట్టణంలో ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

