హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై11 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గత పది రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ దీక్ష విరమించారు. గురువారం సాయం త్రం వివిధ సంఘాల నాయకులు చైతన్యపురిలో అశోక్‌ను కలిసి సంఘీభావం ప్రకటించా రు.
ఆయన ఆరోగ్యం విషమించడంతో విద్యార్థులతో కలిసి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. ఆశోక్ది కే వలం దీక్ష విరమణ మాత్రమేనని, పోరాట విరమణ కాదని చెప్పారు.
విద్యార్థుల పక్షాన ఎంతవరకైనా కొట్లాడతామని, నిరుద్యోగుల డిమాం డ్లు సాధిస్తామని పేర్కొన్నారు. జూలై 15న సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైందని విమర్శించారు.