ఎల్బీనగర్, జూలై 6: నిరుద్యోగుల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు, అశోక్ అకాడమీ డైరెక్టర్ అశోక్ ఆరోగ్యం క్షీణిస్తున్నది. శనివారం నాటికి ఆయన ఆమరణ నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకున్నది.
నిరుద్యోగుల హక్కుల సాధన కోసం గ్రూప్-2లో రెండు వేల పోస్టులు, గ్రూప్-3లో మూడు వేల పోస్టులు, గ్రూప్-1 లో 1:100 నిష్పత్తితో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని, మెగా డీఎస్సీలో 25 వేల ఉద్యోగాలు, 60 రోజుల గడువు ఇవ్వాలని, జీవో 46 రద్దు చేయాలన్న డిమాండ్లతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైతన్యపురిలోని తన నివాసంలో ఆయన దీక్ష చేస్తుండగా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచి పహారా కాస్తున్నారు.