Asha Workers | చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్టీయూ నేతలు, ఆశావర్కర్లు ముందస్తుగా అనుమతులు తీసుకున్నారు. కానీ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి బీఆర్టీయూ ఆశావర్కర్లను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు.
బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్; కార్యదర్శి మారయ్యను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఆశావర్కర్లు, బీఆర్టీయూ నేతలు మండిపడుతున్నారు. ధర్నాకు అనుమతులు ఇచ్చిన తర్వాత ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసులను నిలదీస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవమిదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Asha Workers5
జగిత్యాల జిల్లావ్యాప్తంగా గత రాత్రి దాదాపు 200 మంది ఆశావర్కర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనపర్తి జిల్లాలో చలో హైదరాబాద్‌కు వెళ్తున్న పలువురు ఆశావర్కర్లను ముందస్తుగా అరెస్టు చేశారు. పెద్దమందడిలో ఐదుగురు, రేవల్లిలో ముగ్గురు, ఘన్‌పూర్‌లో ముగ్గుర్ని, గోపాల్‌పేటలో ఇద్దరు, వనపర్తి రూరల్‌లో ముగ్గురు, టౌన్లో ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆశావర్కర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో 11 మంది ఆశాకార్యకర్తలను అరెస్టు చేశారు. రూరల్ పరిధిలో నలుగురు, ధన్వాడలో ఆరుగురు, దామరగిద్దలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

Asha Workers2

Asha Workers3

Asha Workers4

Asha Workers6