భవిష్యత్ అవసరాల మేరకు రహదారుల విస్తరణ : మంత్రి నిరంజన్‌రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో
వనపర్తి : ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో రూ. 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న కన్యకాపరమేశ్వరి ఆలయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల మేరకు వనపర్తిలో రహదారుల విస్తరణ చేపట్టామని వెల్లడించారు.
తాను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రహదారుల విస్తరణ చేపట్టినట్లు వెల్లడించారు. భౌగోళికంగా వనపర్తి రహదారులకు, ఉమ్మడి జిల్లాలోని మిగతా పట్టణాలకు ఎంతో తేడా ఉన్నదని అన్నారు. పాన్ గల్, చిట్యాల, పెబ్బేరు, కొత్తకోట, గోపాల్ పేట ల వైపు రహదారుల విస్తరణ కారణంగా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని, డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో బాధితులకే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఇండ్లు కేటాయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి వాసంతి, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

