హైదరాబాద్ : సెయింట్ జాన్స్ చర్చి హైడ్పార్క్లో జరిగిన ‘ఫ్యాషన్ ఫైనెస్ట్ ఏడబ్ల్యూ22 లండన్ ఫ్యాషన్ వీక్’లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ అరుణాగౌడ్ ప్రదర్శించిన కలెక్షన్లు ఆకట్టుకున్నాయి. లండన్ ఫ్యాషన్ వీక్‌లో భారత్ నుంచి కలెక్షన్లు ప్రదర్శించిన ఏకైక డిజైనర్‌గా అరుణాగౌడ్ గుర్తింపుపొందారు. ఇండియా గ్లామ్ ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకురాలు. ‘అల్మారా బై అరుణాగౌడ్’ అనే లేబుల్‌తో ప్రత్యేకమైన ఫ్యాషన్, ఫంక్షనల్ కలెక్షన్లు అందించే క్లాసిక్ కోచర్ స్టోర్. అల్మారాలో కళాత్మకత, సృజనాత్మకత, నాణ్యత ముఖ్యమైనది.
అరుణాగౌడ్ తన లేబుల్ స్టోర్ అల్మారాను గోవా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. లండన్ వీక్‌లో ఆమె రూపొందించిన డిజైన్లు ఫంక్షన్ ఫ్యాషన్‌లో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అరుణాగౌడ్ మాట్లాడుతూ.. ‘అల్మారా బై అరుణాగౌడ్’ ద్వారా నచ్చిన వారికి నచ్చిన దుస్తులను డిజైన్ చేస్తామని చెప్పారు. లండన్ ఫ్యాషన్ వీక్‌లో భారతదేశం నుంచి కలెక్షన్లు ప్రదర్శించిన ఏకైక డిజైనర్‌గా గుర్తింపు పొందడం ఆనందంగా ఉందన్నారు.