హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసులో హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిైళ్లెకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుచేసింది. పిైళ్లెని ఈడీ 2023 మార్చిలో అరెస్ట్ చేసింది. పలుమార్లు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
ఏపీలో వ్యాన్ బోల్తా..ఏడుగురు దుర్మరణం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో మినీ వ్యాన్ బోల్తాపడగా ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపికల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు ఓ మినీ వ్యాన్ మంగళవారం బయల్దేరింది. దేవరపల్లి మండలం చిలకవారిపాకలు సమీపంలో బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో జీడిపికల కింద ఇరుకుని ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు.