హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జోరు. లే ఆఫ్‌ల భయం. వేలాది ఉద్యోగుల తొలగింపు ఆందోళన నేపథ్యంలో ఐఐటీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ప్రాధాన్యతల్లో మార్పు కనిపిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లు కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలవైపు మొగ్గుచూపారు. జోసా మొదటి విడత సీట్లను పరిశీలిస్తే సివిల్, మెకానికల్‌పై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడయ్యింది. ఇస్రో, డీఆర్డీవో, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతుండటంతో కోర్ బ్రాంచీల పట్ల మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంటున్నారు. జోసా మొదటి రౌండ్లో సీట్లు దక్కించుకున్నవారు ఈ నెల 26లోగా రిపోర్టింగ్, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 30న రెండో రౌండ్ సీట్లు కేటాయిస్తారు. జూలై 3 వరకు ఫీజు చెల్లించి, ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి. జూలై 6న మూడు, 10న నాలుగో రౌండ్ సీట్లు కేటాయిస్తారు. జూలై 16న ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో తుది విడత సీట్లు కేటాయిస్తారు.
సీట్ల భర్తీ వివరాలిలా..