హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): మీరు మీ పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తున్నారా? ఎంతో కొంత డబ్బు వస్తుందన్న ఆశతో ఎవరికి పడితే వారికి అమ్ముకుంటున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే.
ఇలాంటి పాత ఫోన్ల ద్వారానే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా మిమ్మల్నే అరెస్టుచేసే అవకాశం ఉంటుందని సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత ఫోన్లతో మోసాలకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన ముగ్గురు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు.
వారి నుంచి ఏకంగా 4 వేలకుపైగా పాత ఫోన్లు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్ వెల్లడించారు.