మరిపెడ, జూలై 13 : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పూసలతండాకు చెందిన ఆర్మీ జవాన్ మూడ నవీన్ గత నెల తన భార్య ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి స్వగ్రామానికి వచ్చి ఇటీవల శస్త్రచికిత్స చేయించాడు. ఈ నెల 11న కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లి అకడినుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లి విధుల్లో చేరి మళ్లీ సెలవు పెట్టి వస్తానని చెప్పి బయలుదేరాడు. అయి తే విమానాశ్రయానికి చేరకుండా శ్రీశై లం వైపు వెళ్లడం, అకడ కారు, సెల్ఫోన్ వదిలివేయడం కుటుంబ సభ్యు లు ఆందోళన చెందుతున్నారు. ‘ఇక మీకు కనిపించను’ అని కొందరు సన్నిహితులకు మెసేజ్ పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. జవాన్ కుటుంబ సభ్యు లు కారు వదిలిన ఘటనా స్థలికి వెళ్లి అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.