అమ్మమ్మలు, నాయనమ్మల కాలం నాటి వంటకాల పేర్లు వింటేనే నోరూరిపోతుంది. అందులో చాలా వరకూ కనుమరుగు అయ్యాయి. ఇంకొన్ని అంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో ఆ ప్రమాదం రాకుండా.. ప్రాచీన వంటల గురించి తెలుసుకొని, వాటికి డిజిటల్ రూపమిచ్చి, అందరికీ అందుబాటులో ఉంచారు ముగ్గురు అమ్మాయిలు. పుణెలోని ఫ్లేమ్ యూనివర్సిటీకి చెందిన ముష్కాన్, ఖుషీగుప్తా, అనన్యా పూజారి సంప్రదాయ వంటకాలను, రుచులను నేటి తరానికి అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ర్టాలకు చెందిన వైవిధ్యమైన రుచుల తయారీ ప్రక్రియకు డిజిటల్ రూపం ఇచ్చారు. తాము సేకరించిన వంటల వివరాలు community cookbooks. wixsite.com/websiteలో పొందుపర్చారు. ఈ సైట్లోకి వెళ్లి ఏదైనా వంటకం పేరుపై క్లిక్ చేస్తే.. దాని తాలూకు వివరాలు, ఎక్కడ పుట్టింది, ఎలా వండాలి, అందులోకి ఏఏ దినుసులు వాడాలి? అనే విషయాలు తెలుస్తాయి.