హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): దిశ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. 2019 నవంబర్ 28న జరిగిన ఈ ఘటనపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కౌంట ర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చునని పౌరహకుల నేతల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ వాదించారు. నిందితులు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారిస్తుండగా.. నిందితులు ప్రతిఘటించ డం, పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ జరుపాల్సి వచ్చింది’ అని పోలీసుల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణ జనవరి 2కి వాయిదా పడింది.