ఖైరతాబాద్, అక్టోబర్ 18: బీఆర్ఎస్ ప్ర భుత్వమే ఆరెకటికల అభ్యున్నతికి పాటుపడిందని ఆరెకటిక ట్రస్ట్ చైర్మన్ గౌళికార్ నర్సింగ్‌రావు తెలిపారు. సంఘం అఖిల భారత క మిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డబ్బికార్ శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. 75 ఏండ్ల కాలంలో ఏ ప్రభుత్వమూ తమను ఆ దుకోలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలు గా సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. ప్రభుత్వం ఆరెకటికల కోసం కోకాపేటలో ఒక ఎకరం భూమి, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.ఒక కోటి నిధులు కేటాయించిందని, బీసీ బంధులో ఆరెకటికలకు అవకాశం కల్పించిందని, వరంగల్‌లో రూ.1.5 కోట్లతో భవన నిర్మాణం చేపట్టిందని వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం ఆరెకటికలు కృషి చేస్తారని చెప్పారు. సంఘం జాతీయ కార్యదర్శి, బీఆర్ఎస్ సీనియర్ నేత, భారత జాగృతి కో కన్వీనర్ సంతోష్‌కుమార్ హింగోల్కర్కు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.