హైదరాబాద్, జనవరి20 (నమస్తే తెలంగాణ): ఆరెకటిక కులం పేరును మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఆరెకటిక సంఘం ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి ఆ బృందం వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలోని కభేళాలను వేలం ద్వారా కేటాయించడంతో ఆరెకటికలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆరెకటిక సంఘం రాష్ట్ర నేతలు తెలిపారు.
కాంట్రాక్ట్ దకించుకున్నవారు మేకలను కోయడానికి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఈ సందర్భంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీ పేరిట ఆరెకటికలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఇతర కులాలకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆరెకటికులకూ కల్పించాలని, వృత్తిలో ఉన్నవారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరింది.