ACB | హైదరాబాద్ : అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌గా ఐజీ ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏసీబీ ఏడీజీ రవిగుప్తాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియలో భాగంగా నగర అడిషనల్ కమిషనర్ (క్రైమ్స్), సిట్ చీఫ్‌గా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ ఏసీబీకి బదిలీ చేయబడ్డారు. 1994లో డీఎస్పీగా నియమితులైన ఏఆర్ శ్రీనివాస్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2004లో కన్ఫర్డ్ ఐపీఎస్‌గా నియమించపడ్డారు. మూడు దశాబ్దాల పాటు పోలీసు శాఖలోని దాదాపు అన్ని విభాగాల్లో పనిచేశారు. ఇటీవల ఐజీగా పదోన్నతి పొందారు. ప్రతిష్టాత్మక యూఎన్ శాంతి పతకం, సేవా పథకాలు ఆయన విశిష్ట సేవలకు మరింత గుర్తింపునిచ్చాయి.