మహబూబ్‌నగర్, మార్చి 19 : ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. వన్‌టౌన్ సీఐ అప్పయ్య కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్ (38) విధులు నిర్వహిస్తూ గౌడ్స్ కాలనీలో భార్య మమత, కుటుంబం తో కలిసి నివసిస్తున్నాడు. గతేడాది డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడడంతో గాయాలయ్యాయి.
ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా.. చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడినట్టు తెలిసింది. ఆరో గ్యం సరిగాలేకపోవడం .. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ మంగళవారం రాత్రి అద్దె ఇంట్లో భా ర్య, కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు గది తలుపులను పగులగొట్టి పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్‌కు ఒక బాబు ఉన్నాడు.