పెంచికల్ పేట్, జూలై 17 : పురిటి నొప్పులతో దవాఖానకు బయలుదేరిన గర్భిణికి అవస్థలు తప్పలేదు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలంలోని ఎర్రగుంటకు చెందిన గిరిజన మహి ళ ఆత్రం సౌందర్యకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అం దించారు. కిలోమీటర్ దూరంలో ఉన్న ఉచ్చమల్లి వాగు లోలెవెల్ వంతెన వరకే అంబులెన్స్ వచ్చి ఆగింది. ఇటీవల వంతెన నిర్మించినా అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో బురదమయంగా మారింది. దీంతో గర్భిణి బంధువు సాయంతో బైక్‌పై వాగు వద్దకు వచ్చింది. అక్కడి నుంచి సుమారు 200 మీటర్ల బురదమయమైన రోడ్డుపై అవస్థలు పడుతూ నడుచుకుంటూ వెళ్లి అంబులెన్స్ ఎక్కింది. అక్కడి నుంచి కాగజ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్రోచ్ రోడ్డు నిర్మించి రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.