హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డిని నియమించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు సభ్యులను నియమించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్ కుమార్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, గడుగు గంగాధర్, కేవీ నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మారికంటి భవానీలు సభ్యులుగా నియామకమయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం రాష్ట్రంలో త్వరలోనే అన్ని కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వేను నిర్వహించనున్నామని గవర్నర్ జిష్టుదేవ్వర్మకు బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ వివరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సోమవారం కలిసి సర్వే షెడ్యూల్ వివరాలను అందజేశారు.