హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : వివిధ దేశాల్లో జాగృతి అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం ప్రకటన విడుదల చేశారు. న్యూజిలాండ్ అధ్యక్షురాలిగా అరుణజ్యోతి ముద్దం, గల్ఫ్ అధ్యక్షుడిగా చెల్లంశెట్టి హరిప్రసాద్‌ను నియమించారు.
ఖతర్, యూఏఈ, కువై ట్, సౌదీఅరేబియా, ఒమన్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, ఫిన్లాండ్, పోర్చుగల్, మాల్టా, కెన్యా, ఇరాక్, కుర్దిస్థాన్ అధ్యక్షులతోపాటు మహారాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస సుల్గేను నియమించినట్టు పేర్కొన్నారు.