హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో పా ర్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందు కు సాగేందుకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. వరంగల్, మెదక్, కరీంనగర్, జహీరాబాద్, పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ, నాగర్కర్నూల్, నిజామాబాద్, మహబూబ్నగర్.. మొత్తం 10 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 70 అసెంబ్లీ ని యోజకవర్గాలకు సమన్వయకర్తలను కేటీఆర్ నియమించారు.
ఎన్నికల్లో పా ర్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమన్వయకర్తలు ముందుకు సాగాలని ఆయ న దిశానిర్దేశం చేశారు. సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పా ర్టీ సీనియర్ నేతలను నియమించారు.