హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రవాణాశాఖలో మరో ఆరుగురు అసిస్టెంట్ మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లకు శనివారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు.
గతంలో 96 మందికి నియామకపత్రాలు ఇవ్వగా తాజాగా ఆరుగురికి అందజేశారు. విధుల్లో సక్రమంగా, నిజాయతీగా పని చేయాలని, రవాణాశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కోర్టు కేసుల వల్ల ఆరుగురి నియామకాలు పెండింగ్‌లో ఉండడంతో ఇన్ని రోజులు ఆలస్యమైందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీఎం సెక్రటరీ శ్రీనివాస్‌రాజు, రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.