హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డుమెంబర్ల అపాయింట్ డే ఈ నెల 22కు వాయిదా పడింది. మొదట నిర్ణయించిన ప్రకారం 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవని, తమ ప్రమాణస్వీకారాలను 22కు వాయిదా వేయాలని నూతన ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పంచాయతీరాజ్‌శాఖ అపాయింట్ డేను వాయిదా వేసింది. అదేరోజు గ్రామపంచాయతీల కొత్తపాలకవర్గాలు పదవీ బాధ్యతలు స్వీకరించనుండటంతోపాటు తొలి పాలకమండలి సమావేశాలు నిర్వహించాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 9న ఇచ్చిన గెజిట్‌ను సవరిస్తూ నూతన నోటిఫికేషన్ విడుదలచేశారు. తొలి విడత 11న, మలి విడత 14న, తుది విడత 17న పంచాయతీ ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే.