DDMS | ఉస్మానియా యూనివర్సిటీ : దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్స్ సెంటర్లో పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్‌కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్స్), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్ అసిస్టెంట్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత పదవ తరగతి అని వివరించారు.
రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ అసిస్టెంట్ వంటి పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత ఇంటర్మీడియట్ అని చెప్పారు. అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 30 చివరి తేదీ అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 8309037134, 6305895867 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
TG TET 2024-II | టీజీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. 22 వరకు ఎడిట్‌కు ఛాన్స్
KTR | తెలంగాణలో కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా మారిన బీజేపీ : కేటీఆర్
KTR | అమావాస్యకు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమికి కూడా పేలట్లేదు.. పొంగులేటికి కేటీఆర్ చురకలు