RIMC | మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 12 : రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్‌లో(ఆర్ఐఎంసి) డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) లో 8వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు 2025 జూన్ 1వ తేదీన (ఆదివారం) పరీక్షలను డైరక్టర్ యన్సీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు Scert. telangana.gov.in లో దరఖాస్తులను (RIMC) వెబ్సైట్ నుండి సేకరించి పూర్తి అప్లికేషన్ ఫారములను పూర్తిచేసి రెండు ప్రతులను ఈ నెల 31వ తేది లోపు కేవలం డైరెక్టర్ SCERT, LB స్టేడియం, బషీర్‌బాగ్, హైదరాబాద్ లో అందజేయాలని, ఇట్టి దరఖాస్తులను రాష్ట్రీయ ఇండియన్ మిలటరే కాలేజ్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌కు పంపకూడదని సూచించారు.