హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టామ్కామ్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. తెలంగాణలో గుర్తింపు పొందిన కాలేజీల నుంచి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత, 21-38 ఏండ్ల వారు, మూడేండ్ల అనుభవం ఉంటే అర్హులని వెల్లడించింది.
బీ1 సర్టిఫికెట్ కలిగి.. జర్మన్ భాషలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు బీ1స్థాయి వరకు జర్మన్ నేర్చుకునే అవకాశం ఉంటుందని వివరించింది. నెలకు రూ.2.2-2.6లక్షల వరకు వేతనం ఇస్తారని తెలిపింది. ఈనెల 25లోపు germanytriple win2025@gmail.comకు దరఖాస్తులు పంపాలని.. పూర్తి వివరాలకు టామ్కామ్ వెబ్సైట్ను సంప్రదించవచ్చునని పేర్కొన్నది.