హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) దరఖాస్తులు ఆహ్వానించింది. బుధవారం ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. వివరాలకు www.tgprb.in వెబ్సైట్ సందర్శించాలని సూచించింది. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో మూడేండ్లకుపైగా ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 1.27 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇం దులో అత్యధికంగా 62.27 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 45.47 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. మొక్కజొన్న 6.27 లక్షల ఎకరాల్లో, కందులు 4.78, సోయాబీన్ 3.77 లక్షల ఎకరాల్లో సాగైనట్టు తెలిపింది.