కాచిగూడ,అక్టోబర్ 5: రాష్ట్రంలోని ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత.. పలు కోర్సులలో శిక్షణకు ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి సూచించారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ,
పీజీ డిప్లొమా ఇన్ సాప్ట్వేర్ ఇంజినీర్, డిప్లొమా ఇన్ సాప్ట్వేర్ ఇంజినీర్, కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ కోర్సు, సైబర్ సెక్యూరిటీ టీచర్ ట్రైనింగ్ కోర్సు, ట్యాలీ, ఒరాకిల్, జావా, ఎంఎస్ అఫీస్, ఆటోకాడ్తో పాటు మరో 20కి పైగా కోర్సుల్లో ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. వివరాలకు 9505800047, www.pacecomputers.org వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.