హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్నకు(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే లింగయ్య ప్రకటనలో తెలిపారు.
2026-27 విద్యాసంవత్సరానికి 8వ తరగతి చదువుతున్నవారు ఆగస్టు 24లోపు ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. వివరాల కోసం https ://bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.