ఖైరతాబాద్, అక్టోబర్ 4: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు (20 సీట్లు)లో ప్రవేశాలకు ఆన్లైన్లో ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అకడమిక్ ఇంచార్జి డాక్టర్ మార్త రమేశ్ తెలిపారు. ఏదైనా డిగ్రీ పాసై, ఈ నెల 31 నాటికి 30 ఏండ్లలోపు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులని సోమవారం మీడియాకు వెల్లడించారు. తెలంగాణవారు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5గంటలలోగా అసోసియేట్ డీన్, అకడమిక్-2, 2వ అంతస్తు, ఓల్డ్ ఓబీపీ బ్లాక్, నిమ్స్ హాస్పిటల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. వివరాలకు www.nims.edu.inను చూడాలని సూచించారు.