హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొ దటి సంవత్సరం ప్రవేశాలతోపాటు 6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ మేరకు మైనార్టీ గురుకుల సొసైటీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మైనార్టీ అభ్యర్థులకు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్పై, ఇతర వర్గాలకు లక్కీడ్రా పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సీవోఈల్లో ప్రవేశాలకు మాత్రం స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామని సొసైటీ పేర్కొన్నది.