హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్తగా పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ‘ఈ-పాస్‌పోర్టులు’ జారీ కానున్నాయి. ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉన్నవారి గడువు ముగిశాక ‘ఈ-పాస్‌పోర్ట్’కు దరఖాస్తు చేసుకోవచ్చని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జే స్నేహజ తెలిపారు.
ప్రతి ఈ-పాస్‌పోర్ట్‌లో అంతర్జాతీయ పౌర విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల బయోమెట్రిక్, వ్యక్తిగత సమాచారంతో కూడిన ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్ ఉంటుందని, ఈ చిప్‌తో పాస్‌పోర్ట్ ట్యాంపరింగ్, ఫోర్జరీ, దుర్వినియోగాన్ని కట్టడి చేయొచ్చని వివరించారు. ఈ-పాస్‌పోర్ట్ కోసం www. passportindia. gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.