హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలకు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నిషేధిత, ఆంక్షల జోన్ల వంటి నిబంధనలు ఉన్నట్టే.. ఇతర నీటి వనరుల సమీపాల్లో నిర్మించే భవన నిర్మాణాల అనుమతుల కోసం కూడా ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు 7.4.2012న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 168ని జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆ ధారంగానే అనుమతులు ఇస్తున్నారు. 1998 నుంచి 2011 వరకు భవన నిర్మాణ అనుమతుల నిబంధనల కోసం ఇ చ్చి న 19 జీవోలను కలిపి జీవో 168ని తె చ్చారు.
జోన్ల పరిధిలో నిర్మాణాలకు నిబంధనలు
అక్రమ నిర్మాణాలు తెలిస్తే కూల్చేస్తాం
జంట జలాశయాల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు తెలిస్తే కూల్చి వేస్తామని జలమండలి తెలిపింది. జంట జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల లో రాజకీయ ప్రముఖుల సౌధాలపై ‘నమస్తే తెలంగాణ’ శనివారం కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. క్రమణలు ఉన్నట్టు తెలిస్తే కూల్చివేస్తామని జలమండలి అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యం లో అసలు జంట జలాశయాల పరిధుల్లో అసలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయా? లేవా? అనే వివరాలపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. గతంలో అనేకచోట్ల ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. వాటిని ఇప్పుడు వెల్లడించలేదు. ఒకవేళ ఆక్రమణలు లేవని నిర్ధారిస్తే.. ఎలాంటి ఆక్రమణలను ఇప్పటివరకు తాము గుర్తించలేదనే ప్రకటన కూడా చేయలేదు. గండిపేట రిజర్వాయర్ ఎఫ్టీఎల్ను 17 90గా నిర్ధారిస్తూ సర్వే నిర్వహించినట్టు పేర్కొన్నారు. కానీ 70వ దశకంలో 1792 వరకు నీటిని నిల్వచేసిన జలాశయంలో 1790ని ఎఫ్టీఎల్గా నిర్ధారించేందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.