హైదరాబాద్, జూలై 9(నమస్తే తెలంగా ణ): కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ఎదుట మంగళవారం 20మంది డీఈలు హాజరయ్యారు. వివరణను అఫిడవిట్ల రూ పంలో దాఖలు చేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించారు. బుధవారం హాజరుకావాలని ఏఈఈలను సమాచారమి చ్చారు. గతంలో పనిచేసిన ఇరిగేషన్ సెక్రటరీలను కూడా పిలువనున్నట్టు తెలిసింది. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్‌ను పరిశీలించిన జస్టిస్ చంద్రఘోష్.. మరికొన్ని డాక్యుమెంట్లు కా వాలని కోరారు. నివేదికలోని కొన్ని అంశాలపై కమిషన్ వివరణ కోరింది. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్ఎస్, సీడబ్ల్యూసీ విభాగాల్లో పలువురిని పిలువనున్నది. టెక్నికల్ విచారణ తుదిదశకు చేరడంతో అకౌంట్స్ విచారణను మొదలుపెట్టనున్నట్టు తెలిసింది. ప్రాజెక్టును విభేదించిన నిర్మాణ సంస్థ వ్యక్తిని కూడా కలువనున్నది. బరాజ్‌ల సమాచారం ఇస్తానని కేంద్ర జల్‌శక్తి సలహాదారు వెదిరే శ్రీరా మ్ తెలిపారు. ఆయన శుక్ర లేదా సోమవా రం కమిషన్ ముందుకు రానున్నారు.