Bhudan Lands | భూదాన్ భూములపై అప్పీల్ డిస్మిస్
Bhudan Lands | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు బెంచ్ నిరాకరించింది.
Bhudan Lands | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు బెంచ్ నిరాకరించింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ కే పద్మ సహా 20 మంది దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై హైకోర్టు రిజిస్ట్రీ ప్రాథమిక దశలోనే అభ్యంతరం చెప్పింది. ఈ అభ్యంతరంపై న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది.
భూదాన్ భూములపై రాష్ట్ర ప్రబుత్వానికి అధికారం ఉండదని, దీనిని సింగిల్ జడ్జి పట్టించుకోలేదని, వెయ్యి ఇండ్లను అన్యాయంగా కూల్చేశారని, వాళ్లలో 300 మందికిపైగా పట్టాలు మంజూరు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అర్హులైనవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని తెలిపారు. వాదనల తర్వాత డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబేనని తేల్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

