Nagarjuna Sagar | తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై జల వివాదానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు మరోసారి తెర తీశారు. ఏపీ ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే అక్రమంగా కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పోటీగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.