హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : పోలవరం-నల్లమలసాగర్‌తో తెలంగాణకు నష్టం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పే ర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్పోజ్ కావడంపై స్పందిస్తూ సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇచ్చారో, దిగువన పోలవరం-నల్లమలసాగర్‌కు అనుమతి ఇవ్వాలంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ప్రయోజనాలు తీరాక నీరు మిగిలితే తెలంగాణ సైతం ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏపీకి సరిపోగా మిగిలిన నీటిని వాడుకోవచ్చని తెలిపారు.