హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తానని తెలిపారు. కాగా బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వినోద్‌కుమార్ హామీ ఇచ్చినట్లు వంశీకృష్ణ తెలిపారు. ఇక్కడ కరీంనగర్ జిల్లా గంగాధర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు తదితరులు ఉన్నారు.