హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నడుమ తలెత్తిన వివాదంపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు స్పందించారు.
తాను చేసిన వ్యాఖ్యలను నాగేశ్వర్ బేషరతుగా ఉపసం హరించుకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం కక్షసాధింపుతో కేసులు నమోదు చేసి వేధించాలని చూడటం సరికాదని ఆదివారం ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. ఆయనపై ఏపీలో పెట్టిన కేసులను వెంటనే ఉపసం హరించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.