హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా ఏపీ జెన్కో ఉద్యోగిని దక్షిణ తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు డిప్యూటేషన్‌పై బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడలోని ఏపీ జెన్కో కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పద్మావతిని డిప్యూటేషన్‌పై టీజీఎస్పీడీసీఎల్ బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ఆమె తెలంగాణలో మూడేండ్లపాటు పనిచేయనున్నారు. పద్మావతి బదిలీ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బదిలీల ప్రక్రియ మొదలైందని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో మరికొందరు కూడా డిప్యూటేషన్‌పై తెలంగాణకు రానున్నట్టు తెలుస్తున్నది.