హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సచివాలయంలో బ్యాం కు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఆయనను దవాఖానకు తరలించారు. సమీర్‌శర్మ కొంతకాలంగా గుండెవ్యాధితో బాధపడుతూ ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకొన్నారు. రెండు రోజుల నుంచి ఆయన విధులకు హాజరవుతున్నారు.