Chandrababu Naidu | బాబు ‘గ్యాస్’..! మరోసారి చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు
ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ అభాసుపాలవుతున్నారు.
- గ్యాస్ సిలిండర్‌తో వంట నా ఘనతే..!
- మరోసారి చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ అభాసుపాలవుతున్నారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తనను మించినవారు లేరన్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న బాబు.. ఇప్పుడు మేధావులు సైతం విస్తుపోయే విధంగా అతిశయోక్తులు వల్లిస్తున్నారు. తాజాగా గ్యాస్‌తో వంట తన ఘనతే అని చెప్పుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సిలిండర్‌తో వంట చేయొచ్చని చెప్పింది నేనే’ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలకు వంట చాలా కష్టంగా ఉండేదని, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్‌తో వంట చేయొచ్చని చేసింది తానేనని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై సెటైర్లు, మీమ్స్ పేలుతున్నాయి. ‘ట్రెండింగ్‌లో ఏ టాపిక్ ఉంటే దాన్ని కనిపెట్టింది.. మీరే..!’ అంటూ చంద్రబాబుకు నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. ‘నెక్స్ట్.. క్రూడ్ ఆయిల్ నుంచి ఎల్పీజీ గ్యాస్ తీయొచ్చని గల్ఫ్ దేశాలకు సలహా ఇచ్చింది తానే.. అని చంద్రబాబు చెప్తారంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ‘గ్యాస్ సిలిండర్‌పై వంట చేయడం చంద్రబాబు నేర్పకుంటే ఏమై పోయే వాళ్లమో’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘ఏప్రిల్ ఫూల్ చేయడానికే బాబు ఇలా చెప్పి ఉంటారు.’ అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 2నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో తన కంటే సీనియర్ ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. అంతకుముందు కోహినూర్ డైమండ్‌ను తాను ఎక్కడ తీసుకెళ్లిపోతానో అనే భయంతో లండన్ పోలీసులు తనపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సెలవిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

