శ్రీనాథ్ మృతిపై తండ్రి అనుమానం
అమెరికాలో ఏడాది క్రితం జరిగిన నా కుమారుడి మరణంపై అనుమానం ఉంది.. దీనిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయండి.. అంటూ మృతుడి తండ్రి ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.
- నిరుడు అమెరికాలో మృతి చెందిన గుంటూరువాసి
- దర్యాప్తు చేపట్టాలని ఏపీ సీఐడీకి తండ్రి ఫిర్యాదు
- మృతుడి భార్య, అత్తామామలపై కేసు?
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అమెరికాలో ఏడాది క్రితం జరిగిన నా కుమారుడి మరణంపై అనుమానం ఉంది.. దీనిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయండి.. అంటూ మృతుడి తండ్రి ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. ఈ కేసులో మృతుడి భార్య సాయిచరణి, మామ సుఖవాసి శ్రీనివాసరావు, అత్త రాజశ్రీని నిందితులుగా చేరుస్తూ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. మృతుడి తండ్రి బాబూరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన గంగూరి బాబూరావు కుమారుడు శ్రీనాథ్. శ్రీనాథ్కు సాయిచరణితో 2016 డిసెంబర్లో వివాహం జరిగింది. అనంతరం 2017 జనవరిలో భార్యాభర్తలు అమెరికాకు వెళ్లారు. కొద్దికాలానికే తన కొడుకుతో వివాహం తనకిష్టం లేదంటూ కోడలు తరచూ చెప్పేదని బాబూరావు తెలిపారు. పలుమార్లు తన కొడుకును ఇబ్బందుల పాలుచేసిందని ఆరోపించారు. పిల్లలు పుట్టకుండా తన కోడలు చరణి మెడిసిన్ వాడేదని, పిల్లలు పుడితే తన అందం తగ్గుతుందని తన కొడుకుతో చెప్పేదని, తనకు పెళ్లి కాలేదని చెప్తూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు పెట్టేదని బాబూరావు తెలిపారు. ఎప్పటికైనా నిన్ను చంపేస్తాను.. అని తన కొడుకును బెదిరించేదని, దీనిపై తన వియ్యంకుడితో చర్చిస్తే తమ కుమార్తెకు సర్ది చెప్తామని ఆనాడే హామీ ఇచ్చారని బాబూరావు చెప్పారు.
లోయలో పడి చనిపోయాడా?
నిరుడు అక్టోబర్ 16న తన అత్తామామలకు ఫోన్ చేసి శ్రీనాథ్ చనిపోయాడని చరణి సమాచారం ఇచ్చింది. దీంతో బాబూరావు దంపతులు, వియ్యంకుడు శ్రీనివాసరావుతో కలిసి అమెరికా వెళ్లారు. అకడ కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాలకు హాజరుకాని చరణి, తన తల్లిదండ్రులనూ తొలుత ఇంటిలోకి అనుమతించలేదు. శ్రీనాథ్ ఎలా చనిపోయాడని శ్రీనాథ్ తల్లిదండ్రులు ప్రశ్నించగా, తామిద్దరం రెండురోజుల యోనోహిల్స్కు ట్రెకింగ్కు వెళ్లామని, మొదటి రోజు బాగానే తిరిగి వచ్చామని, రెండోరోజు కాలు జారీ శ్రీనాథ్ లోయలో పడిపోయాడని చెప్పింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చావా అని అడిగితే.. తానివ్వలేదని, సమీపంలోని అమెరికా జంట పోలీసులకు సమాచారమిచ్చారని తెలిపింది. అకడే కొద్దిరోజులు ఉన్న బాబూరావు దంపతులు కుమారుడి మరణం గురించి విచారించారు. బంధువులు, మిత్రుల ద్వారా పలు రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు చివరకు కొడుకుది అనుమానాస్పద మరణమని నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అకడే ఉన్న కోడలి తండ్రి సుఖవాసి వీరిపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి ఇండియాకు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చిన బాబూరావు ఇటీవల సీఐడీని ఆశ్రయించడంతో తాజాగా కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

